వికారాబాద్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి వికారాబాద్ లో మాజీ ఎమ్మెల్యే ఆనంద్
ఆంజనేయ స్వామి కటాక్షంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని మణికంఠ నగర్ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత దైవచింతన అలవర్చుకొని సన్మార్గంలో నడుచుకుంటే చక్కటి జీవితం సాధ్యపడుతుందని తెలిపారు.