గుంతకల్లు: పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి, ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రైల్వే స్టేషన్ లోని ఏడవ నంబర్ ప్లాట్ ఫామ్ లో గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ లో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. ప్రయాణికుల సమాచారంతో రైల్వే స్టేషన్ లోని ఏడవ నంబర్ ప్లాట్ ఫామ్ వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఆధారాలను చూసారు. అయితే ఏలాంటి ఆధారాలు లభించలేదు.