ఇల్లందు: ఇల్లందులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన బ్రిడ్జి, మినీ స్టేడియం, అర్బన్ హెల్త్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.