భీమిలి: కొమ్మాది ఎస్సీ కాలనీలో ఇంటి పట్టాల కోసం ఆందోళన: ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా
విశాఖ జిల్లా చినగదిలి మండలం కొమ్మాది ఎస్సీ కాలనీలో 30 ఏళ్లుగా నివసిస్తున్న 60 కుటుంబాలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పట్టాలు అందించాలని బాధితులు కోరారు.