పరకాల: పరకాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి
హన్మకొండ జిల్లా పరకాల రాజుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. నాణ్యతతో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్య అందుతుందని తెలిపారు.