కొండపి: కొండపి బస్టాండ్ నుంచి దాసిరెడ్డిపాలెం వరకు నూతన డ్రైనేజీ కాలువ పనులను మంత్రి స్వామి ఆదేశాలతో ప్రారంభించిన అధికారులు
ప్రకాశం జిల్లా కొండపిలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి దాసిరెడ్డిపాలెం వరకు సిమెంట్ సైడ్ కాలువల పని మొదలైంది.మంగళవారం జెసిబి సహాయంతో పాత కాలువలను తొలగించి కొత్త కాలువ నిర్మించాలని నిర్ణయించారు. పట్టణంలో ప్రధాన రహదారుల్లో సైడ్ కాలవలు నిర్మిస్తున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో దోమలు బెడద ఎక్కువైంది. కాలవల నిర్మాణంతో సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు తెలిపారు.