జాతీయ లోక్అదాలత్లో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో 19,577 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ. కబర్తి తెలిపారు. మోటార్ ప్రమాదాలకు సంబంధించిన 197 కేసుల్లో బాధితులకు రూ.6.34 కోట్ల నష్టపరిహారం చెల్లించారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో 28 బెంచీలతో సివిల్284, క్రిమినల్19096, 197మోటార్ యాక్సిడెంట్ కేసులు పరిష్కరించారు.