మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్: ప్రజాభవన్ వరకు జర్నలిస్టుల పాదయాత్ర, ఎస్పీకి వినతి పత్రం
తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న హైదరాబాద్ ప్రజాభవన్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు జర్నలిస్టులు ప్రకటించారు. ఈ మేరకు మహబూబ్నగర్ ఎస్పీ జానకి గారికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు.