శ్రీశైలం: నేషనల్ హైవే 34O C ఎర్రగూడూరు గ్రామం తెలుగు గంగ బ్రిడ్జిపై నాణ్యత లోపాలు. బయటపడ్డ ఇనుప కడ్డీలు
పాములపాడు మండలం ఎర్రగుడూరు గ్రామం వద్ద తెలుగు బ్రిడ్జిపై నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలపండి అంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.నేషనల్ హైవే 340 c ని నిర్మించిన పిఎస్ కే కంపెనీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా నాణ్యత లోపంగా రోడ్డు నిర్మించాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూల్ నుంచి ఆత్మకూరు వరకు నిర్మించిన ఈ రహదారి పూర్తి నాణ్యత లోపం గా ఉందని ఎర్రగూడూరు బ్రిడ్జిపై సిమెంటు పోయి కడ్డీలు బయటపడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు స్పందించాలన్నారు.