గుంతకల్లు: గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణ, దాడిలో ఇద్దరికి గాయాలు, పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జక్కలచెరువు గ్రామంలో ఇరు వర్గాలు ఘర్షణ పడి ఇద్దరు గాయపడ్డారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జక్కలచెరువు గ్రామానికి చెందిన షరీఫ్, ఖాదర్ వలి అనే యువకులకు అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో చిన్నపాటి విషయంపై గొడవ జరిగింది. దీంతో పరస్పరం దాడులు చేసుకోగా షరీఫ్, ఖాదర్ వలి లకు గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు