కురుపాం: ఈనెల 6న ఆశ డే బహిష్కరణ: సమస్యల పరిష్కారం కోసం ఆశ వర్కర్ల ఆందోళన
రాంబద్రపురం, కొమరాడ పీహెచ్సీల వద్ద ఆశ వర్కర్లు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం 26 వేలు, ఉద్యోగ భద్రతతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 6న 'ఆశ డే'ను బహిష్కరిస్తున్నట్లు సిఐటియు నాయకులు, ఆశ వర్కర్ల యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు.