శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం
శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.వరుస సెలవు దినాలు మరియు 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావడంతో స్వామి అమ్మవార్లు దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం తరలివస్తున్నారు. దీంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. భక్తులకు త్వరగతినా దర్శనం పూర్తయి అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు.