ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ల్యాబ్ టెక్నీషియన్ కృపాసాగర్ సెల్ఫీ వీడియో వైరల్.. పోలీసులు దర్యాప్తు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత రెండు రోజుల క్రితం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ల్యాబ్ టెక్నీషియన్ కృపా సాగర్ సెల్ఫీ వీడియో ఇటీవల బయటపడింది. మూడు నెలల క్రితం వివాహం చేసుకోగా, భార్యతో కలిసి కాపురం ఉంటున్నాడు అయితే వివాహానికి ముందు అరుణ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య ఆరోపించింది. ఈ వీడియోలో మృతుడు అరుణ అనే మహిళతో తనకు వేధింపులు ఎక్కువయ్యాయని వేధింపులు భరించలేకున్నానని ఈ వీడియోలో ఉండడం తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.