నిర్మల్: నిర్మల్ పట్టణంలో కొండా బాపూజీ లక్ష్మణ్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన పద్మశాలి ఉద్యోగ సంఘం నాయకులు
Nirmal, Nirmal | Sep 21, 2025 నిర్మల్ పట్టణంలోని కొండా బాపూజీ విగ్రహం వద్ద పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ఉమా శంకర్, పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలక రమణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని చూపించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్ద రమణ, సంఘ సభ్యులు పాల్గొన్నారు