హిందూపురం1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దొంగల ముఠా అరెస్టు
15 లక్షల విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని త్యాగరాజ నగర్ గుడ్డం లో వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానితంగా కనపడిన నలుగురు వ్యక్తులను పోలీసులు విచారించగా ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ముఠాగా పోలీసులు గుర్తించారు. వారితో పాటు మరో నలుగురు మైనర్లు కూడా ఈ దొంగల ముఠాలో ఉన్నట్లు మొత్తంగా ఎనిమిది మందిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి వారు దాచిన 15 లక్షల విలువచేసే 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టు ముందు హాజరు పరుస్తున్నట్లు హిందూపురం డిఎస్పి మహేష్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.