పెద్దపంజాణి: రాయలపేట రోడ్డు విస్తరణకు సంబంధించి చాలా మంది సుముఖత వ్యక్తం చేసినప్పటికి ఒకరిద్దరూ అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గ్రామానికి చేరుకుని స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సందేహాలతో పాటు అపోహలను నివృత్తి చేశారు. రోడ్డు విస్తరణతో పూర్తిగా ఇల్లు కోల్పోయే వారికి గ్రామంలోనే ఇంత స్థలాన్ని చూసి పట్టా ఇప్పిస్తామని, ఇక పాక్షికంగా తొలంచాల్సిన వారికి పరిహారం అందేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. దీనిపై అక్కడికక్కడే ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి వెంటనే పనులు మొదలు కావాలని ఆదేశించారు.