సిద్దిపేట అర్బన్: సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్ లతో సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్
అన్ని విభాగాల ఉన్నతాధికారులు, వార్డు ఆఫీసర్ లతో సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో పారిశుద్ధ్య లోపం లేకుండా పట్టణమంతా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వార్డు ఆఫీసర్ లను ఆదేశించారు. ఉదయాన్నే పారిశుద్ధ్య కార్మికుల హాజరు అనంతరం తప్పనిసరిగా వార్డులలో పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులు నిర్వహింప చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా పట్టణంలో ఎక్కడ కూడా పిచ్చి గడ్డి,చీదు లేకుండా చూడాలని , వర్షం కారణంగా రోడ్లపైకి కొట్టుకు వచ్చిన ఇసుక లేకుండా తొలగించాలన్నారు. ఇంటింటికి చెత్త సేకరణకు వెళ్లిన సమయంలో తప్పనిసరిగా మ