గన్నవరం: గన్నవరం ఎయిర్ పోర్టు నిర్వాసితుల నిరసన: రిలే దీక్షలు ప్రారంభం
గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. 11 ఏళ్లుగా హామీలు అమలు చేయడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.