సామర్లకోట మండలం నవరగ్రామంలో, నిర్వహించిన వ్యవసాయపరపతి సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎంపీ శ్రీనివాస్
కాకినాడ జిల్లా,పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం నవర గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యవర్గం చైర్మన్ మరియు డైరెక్టర్లు ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం ఉదయం 10:30 కు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి , ఎమ్మెల్సీ పేరాబాత్తుల రాజశేఖర్, పాల్గొన్నారు. డిసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.