ఖైరతాబాద్: బైకు దొంగను అరెస్ట్ చేసిన అఫ్జల్ గంజ్ పోలీసులు
అఫ్ఘల్గంజ్ పోలీసులు సోమవారం ఓ బైక్ దొంగను పట్టుకొన్నారు. నిందితుడు కురవ నరేశ్ నుంచి ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. OGH పార్కింగ్, అఫ్టల్గంజ్, మహబూబ్నగర్లో దొంగతనాలు చేసినట్లు విచారణలో తెలిసింది. డుప్లికేట్ తాళాలు ఉపయోగించి వాహనాలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలోనూ నరేశ్ మీద పాత కేసులు ఉన్నాయని తెలిపారు.