శ్రీశైలం మల్లన్న సేవలో కేంద్ర రవాణా,జాతీయ రహదారుల మంత్రి శ్రీ హర్ష మల్హోత్ర దంపతులు
శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి హర్ష మల్హోత్రా దంపతులు దర్శించుకున్నారు.దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు మరియు అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని, మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.తదనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు స్వామి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, అందజేశారు