అగళి ఎంపీడీవో కార్యాలయం వద్ద సర్పంచులు మూకుమ్మడి నిరసన.
గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని ఆగలి మండల సర్పంచ్లు బుధవారం ఎంపీడీవో కార్యాలయం నిరసన చేశారు. మధ్యాహ్నం భోజనాల సైతం ఎంపీడీవో కార్యాలయ ముందు కూర్చొని తిని భీష్మించుకు కూర్చున్నారు. ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ బయటికి వచ్చి తమకు సమాధానం ఇచ్చేవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని సర్పంచ్లు అక్కడే నిరసనకు దిగారు.