హత్నూర: సంగారెడ్డి లోని చిరు వ్యాపారులతో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట ముచ్చట,చిరు వ్యాపారుల హర్షం
సంగారెడ్డి పట్టణంలోని ఐబి గెస్ట్ హౌస్ సమీపంలో దీపావళికి ఉపయోగించే బొమ్మలు, ప్రమిదలు, పూల దుకాణాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అటు వైపు వెళ్తూ చిరు వ్యాపారులతో కాసేపు ముచ్చటించారు. బొమ్మలు, ప్రమిదలు ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు? రోజూ ఎంత గిరాకీ అవుతుంది. ఎంత గిట్టుబాటు అవుతోందని అడిగి తెలుసుకున్నారు. చివరిగా వారి వద్ద నుంచి బొమ్మలు, ప్రమిదలు కొనుగోలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడడం పై చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.