హిమాయత్ నగర్: ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి: మాజీ మంత్రి కేటీఆర్
రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభకు కేటీఆర్ శనివారం ఉదయం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పదవులు చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు సీతారాం ఏచూరి అని అన్నారు. ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శనేత సీతారాం ఏచూరి అని ఆయన అన్నారు.