శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో శనివారం సాయంత్రం ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. 350 మందికి పైగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు సేవలు అందిస్తారని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్ జె రత్నాకర్ తెలిపారు. నేటి నుండి నెలరోజుల పాటు భక్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని, ఈ శిబిరం నవంబరు 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.