హిందూపురం పట్టణంలోని ధన్ రోడ్డులో నారాయణమ్మ ఇంట్లో 15 గ్రాముల బంగారు 20 గ్రాముల వెండి 50,000 నగదు చోరీ
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని దన్ రోడ్డులో నారాయణమ్మ వెంకటేశులు అనే వ్యక్తుల ఇంట్లో తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నారాయణమ్మ బంధువుల ఇంటికి వెళ్లి ఉదయం ఇంటికి వచ్చి చూసుకోగా ఈ చోరీ జరిగినట్లు గుర్తించి హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి 15 గ్రాముల బంగారు 20 గ్రాముల వెండి 50 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు .కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.