సంగారెడ్డి: బీసీ రిజర్వేషన్లపై బిజెపి ద్వంద్వ వైఖరి నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద ధర్నా, నిరసన
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరికి నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా కార్య దర్శి జయరాజ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. పార్లమెంటులో వెంటనే చట్టం చేయాలని కోరారు. శనివారం నిర్వహించే రాష్ట్రవ్యాప్త బందుకు సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, ప్రవీణ్ కుమార్, సాయిలు పాల్గొన్నారు.