జమ్మలమడుగు: జమ్మలమడుగు : బాబు జాగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా దళిత నాయకుల ఘన నివాళులు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఆదివారం బాబు జాగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు దళిత నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా బాబు జాగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పిచ్చికే బాబు,చిన్నయ్య, సుబ్బగాల్ల నరసింహులు, కె.బాల ఓబయ్య, మంగదొడ్డి సింగరయ్య, సంతోష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.