పెద్దవంగర: DCM లో అక్రమంగా తరలిస్తున్న 120 క్వింటాళ్ల PDS బియ్యం పట్టుకున్న పెద్దవంగర పోలీసులు,వాహనం సీజ్, ఇద్దరిపై కేసు నమోదు
అక్రమంగా డీసీఎం వ్యాన్ లో తరలిస్తున్న 120 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు పెద్దవంగర పోలీసులు. వారు తెలిపిన వివరాల మేరకు, ఈరోజు సోమవారం, మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర మండల కేంద్రంలో డి. సి .యం వాహనంలో, హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 120 క్వింటాల పిడిఎస్ బియ్యం పట్టుకొని వాహనాన్ని స్టేషన్ కు తరలించారు. వీటివిలువ సుమారు 4లక్షల68 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఈ ఘటణలో ఇద్దరి పైన కేసు నమోదు చేసినట్లు పెద్దవంగర పోలీసులు పేర్కొన్నారు.