శ్రీశైలంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు పాల్గొన్న EO శ్రీనివాసరావు
శ్రీశైల క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు ఆంజనేయస్వామికి ఆకు పూజ, సింధూర అలంకరణ, మహామంగళ హారతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించారు. హనుమత్ నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. 12:02 PM