శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకున్న జగద్గురు పీఠాధిపతి
శ్రీ శ్రీ శ్రీ. చెన్నసిద్ద రామ శివాచర్య
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామీజీ గురువారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద స్వామీజీకి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామీజీకి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.