శ్రీశైలం: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి .ఆత్మకూరు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో శిల్పా
ఆత్మకూరు పట్టణంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.కార్యకర్తలకు అండగా ఉంటానని, ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. ఐక్యతతో ముందుకు సాగితే విజయం సాధ్యమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.