గుంతకల్లు: గుత్తి అర్ఎస్ లోని రైల్వే పీడబ్ల్యూఐ కార్యాలయం వద్ద రైల్వే ఉద్యోగి బైక్ చోరీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పీడబ్ల్యూఐ కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన రైల్వే ఉద్యోగి మహబూబ్ పీరా ద్విచక్రవాహనం సోమవారం చోరికి గురైంది. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి రైల్వే డీజల్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ లో పి.మహబూబ్ పీరా టెక్నీషియన్ గా పని చేసేవాడు. ఈ నేపథ్యంలో తన ద్విచక్రవాహనం గుత్తి అర్ఎస్ లోని పీడబ్ల్యూఐ కార్యాలయం పక్కన నిలిపి డ్యూటీకి వెళ్ళాడు. విధులు ముగించుకుని భోజనం చేసేందుకు షెడ్ నుంచి ఇంటికి వెళ్లేందుకు వచ్చి బైక్ ను చూడగా కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల బైక్ కోసం గాలించాడు. కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.