ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా..
ఎమ్మిగనూరులో వైసీపీ ఆధ్వర్యంలో 'ప్రజా ఉద్యమం' కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నమయ్య సర్కిల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.