జిల్లాలోని డాక్టర్ల సర్టిఫికెట్ రెన్యువల్, రీ-రిజిస్ట్రేషన్ మరియు ఇతర సేవల కొరకు జిల్లాలోనే రిజిస్ట్రేషన్ యూనిట్ ఏర్పాటు చేసి డాక్టర్ ల రిజిస్ట్రేషన్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పేర్కొన్నారు.శనివారం కర్నూలు మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్ లో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన డాక్టర్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ యూనిట్ ను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర మఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడు ప్రజలక