సిద్దిపేట అర్బన్: సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రత్యేక శిబిరం
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో కొనసాగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరం ఆరవ రోజుకు చేరింది. ఈ మేరకు సోమవారం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛభారత్ అనంతరం, ట్యాంకులను పరిశుభ్రము చేశారు. ప్రకృతి పర్యావరణం బతుకమ్మ అనే అంశాలపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు చక్కగా అవగాహన కల్పించారు. నిజజీవితంలో కుటుంబం, ప్రకృతి, బతుకమ్మ నిత్యజీవితంలో వాటి ప్రాధాన్యత, అవి మానవాళికి చేసే సేవ చక్కగా వివరించారు, అమ్మాయిలుగా సామాజిక సేవ ప్రకృతి పరిరక్షణ బతుకమ్మలో తొమ్మిది రోజులు అమ్మాయిలు పాత్ర వివరంగా వివరించారు. అలాగే, డాక్టర్ తూమ