బండారులంక జెడ్పీహెచ్ స్కూల్ ఎదురుగా అదుపుతప్పి బైక్, తోపుడు బండిని ఢీకొట్టిన కారు, ఆరుగురికి తీవ్ర గాయాలు
అమలాపురం రూరల్ బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన గేటు ఎదురుగా గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ గేటు ఎదురుగా మోటార్ సైకిల్‌ను, తోపుడు బండిని అతివేగంగా వచ్చి బలంగా ఓ కారు ఢీకొట్టింది. ఘటనలో తోపుడు బండి, కారు, బైక్ నుజ్జునుజ్జయ్యాయి. పాఠశాల గేటు పక్కనున్న ప్రహరీ గోడ ధ్వంసమైంది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.