సూర్యాపేట: తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు: దసరా పండుగ వేళ భారీగా పెరిగిన విక్రయాలు
తెలంగాణలో దసరా పండుగ వేళ మద్యం వ్యాపారం రికార్డు సృష్టించింది. కేవలం 3 రోజుల్లోనే రూ.653 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి షాపులకు తరలింది. అక్టోబర్ 19 నాటికే రూ.2,054 కోట్ల మద్యం నిల్వలు లిఫ్ట్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 37 శాతం అధికం.