కర్నూలు: తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆరోగ్య కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నా
విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధులలోకి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అంజి బాబు మీడియాతో మాట్లాడారు. 8 నెలలుగా పెండింగ్లో ఉన్న కార్మికుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు.