పెద్దాపురంలో డ్రైనేజీ నిమిత్తం తవ్విన, కాలువలు వద్ద పైప్ లైన్స్, కుళాయిలు విరిగిపోయాయని స్థానికులు ఆవేదన.
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్నం నాలుగో వార్డ్ గణేష్ నగర్ నందు 100 మీటర్లు డ్రైనేజీ కోసం జెసిబి తో తవ్వి మట్టి తీయడంతో ఆ ప్రదేశం లో ఉన్న కుళాయిలు పైపులైన్లు ఇరిగిపోవడం జరిగింది,డ్రైనేజీ తీసిన నుంచి ఇప్పటికీ పది రోజుల్లో అవుతున్న పైప్ లైన్ మరమ్మత్తు మరియు డ్రైనేజీ వేయడం జరగలేదని స్థానిక ప్రజలు వెళ్లడానికి రావడానికి రాకపోకలు లేకపోగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విష్యంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్య పై హ్యూమన్ రైట్స్ మిషన్ డిస్టిక్ సెక్రటరి సమస్య పరిష్కరిస్తానని అన్నారు.