సిద్దిపేట అర్బన్: సిద్దిపేట కలెక్టరేట్ లో రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, ఇతర ప్రగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ హైమావతి
జిల్లాలో నివాసయోగ్యమైన రెండు పడక గదుల ఇళ్లలో ఎంపిక చేసిన లబ్ధిదారులు మాత్రమే నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో 2 బిహెచ్కె ఇళ్ల మంజూరు, లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత మరియు ఇతర ప్రగతి పనులపై తహసీల్దార్, మున్సిపల్, హౌసింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 2 బిహెచ్కె ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇళ్లు అందించకపోవడం, ఇళ్లు అన్యాక్రాంతం కావడం వంటి ఘటనలు దృష్టికి వచ్చాయని. జిల్లాలో రెండుపడకల ఇళ్లు మంజూరు కాకుండా వేరేవాళ్లు ఆక్రమించి ఉంటునట్లుగా దృష్