పదర: పదరలో ఘనంగా విజయదశమి వేడుకలు: సొంతూళ్లకు చేరుకున్న ప్రజలు
పదర మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ నుంచి బంధువులు చేరుకోవడంతో ఊళ్లలో సందడి నెలకొంది. దుర్గామాత ఊరేగింపు, జమ్మి ఆకుల మార్పిడితో ప్రజలు పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బంగారు మాణిక్యం పాల్గొన్నారు.