పటాన్చెరు: గౌతమ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు బోధన చేస్తున్న విధానాన్ని సమీక్షించిన DEO
పటాన్చెరులోని గౌతమ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతులను సందర్శించి, ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేస్తున్న విధానాన్ని సమీక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని డీఈఓ సూచించారు. కనీస విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో భాగంగా వారికి అవసరమైన మార్గదర్శనాన్ని అందించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, సామర్థ్యాలను మెరుగుపరచేలా బోధన పద్ధతుల్లో నూతనత తీసుకురావాలని ఆయన కోరారు.