ఎలమంచిలి: ఎలమంచిలి ఎంపీటీసీ ఎన్నికలు: రెండో రోజు 17 నామినేషన్లు దాఖలు
ఎలమంచిలి ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు 17 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి పీకేపీ ప్రసాద్ తెలిపారు. ఇందులో వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్థులు మరియు ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.