గుంతకల్లు: గుత్తిలో పర్యటించిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని పిలుపు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రాష్ట్ర చేనేత జౌళి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా వెళ్తూ గుత్తికి చెందిన టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సోమవారం తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వేములపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.