గన్నవరం: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి శనివారం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికి సత్కరించారు.