ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని గురువారం ఉదయం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు అధికారులు నాయకులు స్వాగతం పలికారు, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని రిబ్బన్ లాగి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామంలో డిడిఓ కార్యాలయం రావడంతో అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో అధికారులు ,తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు,