గుంతకల్లు: గుత్తి పట్టణ శివారులో బైక్ ను ఢీ కొన్న ఐచర్ వాహనం, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు, అనంతపురంకు తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో సోమవారం ద్విచక్రవాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బాలరమేష్ , బాల రామాంజనేయులు ఎంసెట్ కోచింగ్ కు అనంతపురంకు వెళ్ళాలని గ్రామంలో ఆటో కోసం వేచి ఉన్నారు. అయితే అదే సమయంలో గ్రామానికి చెందిన సురేష్ ద్విచక్రవాహనంలో గుత్తి పట్టణానికి వెళ్తుండగా బాల రమేష్, బాల రామాంజనేయులు సురేష్ బైక్ ఎక్కారు. అయితే గుత్తి శివారులో బళ్ళారి వైపునకు వెళ్తున్న ఐచర్ నేరుగా వచ్చి బైక్ ను ఢీ కొంది.