మెడికల్ కళాశాలల పై కూటమి ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం
12న హిందూపురంలో బైక్ ర్యాలీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ "ప్రజా ఉద్యమం"కార్యక్రమంకు సంబంధించి వైయస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ ఇంచార్జ్ "దీపిక వేణురెడ్డి" రివ్యూ సమావేశం హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించారు. మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ "ప్రజా ఉద్యమం"పోస్టర్ ను ఆవిష్కరించారు.12 వ తేదీ న హిందూపురం వై.యస్.ఆర్.సి.పి పార్టీ కార్యాలయం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించ నున్నట్లు విజయవంతం చేయాలని కోరారు