జమ్మికుంట: స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట ఆలయంలో పరిసరాలను క్లీన్ చేసిన సిబ్బంది
జమ్మికుంట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ అనే నినాదంతో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాదీ జమ్మికుంట ఆలయంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి ఆధ్వర్యంలో క్లీన్ చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ రాజిరెడ్డి మాట్లాడుతూ ఆలయం ముందు భాగంలో పేరుకుపోయిన మొక్కలను, ఆలయ ప్రాంగణంలో చెట్లను పిచ్చి మొక్కలను తొలగించడం జరిగిందన్నారు. ప్రజలు, యువత పురాతన ఇనోవేటివ్ దేవాలయాలను, స్థలాలను క్లీన్ చేయాలని, చూట్టు పరిసరాలను వర్ష కాలం దృష్ట చెత్త లేకుండా చూసుకోవాలని అన్నారు.